నారాయణపేట జిల్లాలో బోనులో చిక్కిన చిరుత
నారాయణపేట మే 07 (ప్రజాక్షేత్రం):
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా లేగ దూడ లను హతమారుస్తూ… ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్ట కేలకు అటవీశాఖ అధికారు ల బోనుకు ఈరోజు తెల్లవా రుజామున చిక్కింది. మండల పరిధిలోని నంది గామ, దుప్పటిగట్టు, గోకు ల్‌నగర్, గొర్లోనిబావి పరిస రాలలో గత కొన్ని వారాలు గా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమా చారం అందించారు. లేగ దూడలను హతమార్చిన విధానాలు, పాదముద్రల ను సేకరించిన అధికారులు చిరుతపులిగా గుర్తించారు. సోమవారం రాత్రి నందిగా మ,పరిసర ప్రాంతాలలో చిరుత ఉన్నట్లు గుర్తించి… బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా బోనులో చిక్కిన చిరుతను సురక్షిత ప్రాంతాలకు తరలించ నున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.