Praja Kshetram
తెలంగాణ

కార్మిక చట్టాలు రద్దు చేసిన మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి… సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

కార్మిక చట్టాలు రద్దు చేసిన మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి… సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

షాబాద్ మే 10 (ప్రజాక్షేత్రం): దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో కార్మికులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేసిందని వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని అన్నారు లేబర్ కోడ్స్ ఫలితంగా ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటలకు పెరిగిందని కార్మికులు సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యాలను ప్రశ్నించే హక్కును కోల్పోయారని అన్నారు అదే కాకుండా కార్మిక లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు వెట్టి చాకిరిలోకి వెళ్లారని కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని లేకపోతే కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా అనేక చట్టాలు చేసిందని కార్మికుల సంక్షేమం కోసం ఒక్క చట్టం కూడా చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు షాబాద్ మండల నాయకులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Related posts