Praja Kshetram
తెలంగాణ

మతోన్మాద బిజెపి శక్తులను ఓడించండి

మతోన్మాద బిజెపి శక్తులను ఓడించండి

ఇండియా కూటమి అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డిని గెలిపించండి

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం

షాద్ నగర్ మే11 (ప్రజాక్షేత్రం): మతోన్మాద శక్తులు బిజెపిని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కమిటీ పిలుపు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వంశి చేంద్ రెడ్డిని గెలిపించాలి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మతోన్మాద కార్పొరేట్ విధానాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని చిత్తుగా ఓడించాలని మూడోసారి మోడీ గెలిస్తే దేశంలో ఎన్నికలు ఉండవని బిజెపి భారత రాజ్యాంగానికి ప్రమాదమని ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు ఏర్పడుతుందని బిజెపి పాలనలో ప్రజలపై అధిక భారాలు మోపుతూ దేశ సంపదను ఆదాని అంబానీలకు దోచిపెట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని తెలిపారు. ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో బిజెపి అవినీతికి పాల్పడిందని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నబినం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి దేశంలో మోడీ నియంతలగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2017 లో మోడీ పార్లమెంట్ సాక్షిగా రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేశారని వారు అన్నారు పైగా నల్ల చట్టాలను అమలు చేస్తూ రైతులను కాల్చి చంపిన వాళ్లు ఓట్లను ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు ఏటా రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు తొలగించారని వారు ఉన్నారు. వందరోజులలో ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు

Related posts