చేవెళ్లలో బిజెపి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
శంకర్ పల్లి మే 14 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల నియోజకవర్గంలో బిజెపి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి మునుగల్ల సుధాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ధన్యవాద సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బిజెపి కొరకు గత ఇరవై రోజుల నుండి పోలింగ్ రోజు వరకు మున్సిపల్, మండల పరిధి లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, క్లస్టర్ కమిటిలు, బుత్ కమిటీలు, హర్నిషలు కష్టపడి పనిచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాపరెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సురేష్, మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, పార్టీ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మధుమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాజ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, మహిళా మోర్చా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్, శ్రీదేవి, ఎంపీటీసీ శోభా సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శంబారెడ్డి, అజయ్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, అభిలాష్, మండల, మున్సిపల్ వివిధ మోర్చాల నాయకులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
