Praja Kshetram
తెలంగాణ

రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ

రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ

రైతుల పక్షాన పోరాటం చేస్తాం

ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలం*మ

రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి

రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్

రైతుల బాధ ఆవేదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కాదా…

మహేశ్వరం రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం మే 16 (ప్రజాక్షేత్రం): రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గురువారం నాడు మహేశ్వరం నియోజకవర్గం శ్రీశైలం జాతీయ రహదారిపై బారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితమ్మ మాట్లాడుతూ రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట ఇచ్చినా రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూస్తుందని సబితమ్మ విమర్శించారు. రైతుల ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమానికి రైతుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ధాన్యం కొనుగోలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని సబితమ్మ అన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
“రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించింద”న్నారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్ , పాండు యాదవ్,సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహా,చంద్రయ్య,కర్రోళ్ల చంద్రయ్య,అంబయ్య,అరవింద్ శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్,కామేష్ రెడ్డి, దిద్దల అశోక్, బంటు రమేష్, కడమోని ప్రభాకర్ , పోల్కం బాలయ్య, సమీర్,తదితరులు పాల్గొన్నారు.

Related posts