టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్ మే16 (ప్రజాక్షేత్రం):
టీఎస్ పీఈసెట్ 2024 దరఖాస్తుల గడువు పొడి గించినట్లు కన్వీనర్ రాజేశ్ కుమార్ ప్రకటించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచిం చారు. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తు న్న సంగతి తెలిసిందే. డీపీఎడ్‌లో ప్రవేశాల కోసం ఇంటర్ పూర్తయిన విద్యా ర్థులు దరఖాస్తు చేసుకో వచ్చు. బీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ పూర్తయిన విద్యార్థులతో పాటు ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జూన్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో టీఎస్ పీఈసెట్ రాతపరీక్షలను నిర్వహించ నున్నారు.