Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఏపీ అల్లర్లపై సీట్ ప్రాథమిక నివేదిక

ఏపీ అల్లర్లపై సీట్ ప్రాథమిక నివేదిక

 

 

అమరావతి మే 20 (ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది.క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఈరోజు ఉద యం10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు.మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి ప్రాథమిక నివేదిక అంద నుంది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది.రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధి తులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారిం చాయి.ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, సీసీ కెమెరాలు పరిశీలన, వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి.పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం,ముందస్తు జాగ్ర త్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

Related posts