Praja Kshetram
జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. భారీగా ప్రాణనష్టం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. భారీగా ప్రాణనష్టం

 

ఛత్తీస్‌గఢ్‌ మే 28 (ప్రజాక్షేత్రం): ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), నక్సలైట్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వివరాలు అందడంతో.. అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఈ కాల్పులు చోటు చేసుకుంది. ఇందులో భారీగా ప్రాణనష్టం జరిగిందని సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌ని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఉద్దేశంతో.. డీఆర్‌జీతో కలిసి పారామిలటరీ బలగాలు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో తరచుగా ఎన్‌కౌంటర్స్ సంభవిస్తున్నాయి. గత శనివారమే (మే 26) రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగ్గా.. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా బెల్‌పొచ్చా, జిన్‌టాంగ్, ఉసకవాయ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఉదయం 6 గంటల సమయంలో వారిని గమనించిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దాదాపు రెండు గంటలపాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది.అంతకుముందు మే 26వ తేదీన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్, నారాయణ్‌‌పూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఆ ఎదురుకాల్పులు జరగ్గా.. మొత్తం ఏడుగురు నక్సలైట్ల మృతిచెందారు. మరో 12 మంది నక్సలైట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అధికారులు భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టులు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. కొన్ని రహదారుల్లో భారీ వృక్షాలను నరికి అడ్డంగా పడేశారు. నాలుగు విద్యుత్తు స్తంభాలను సైతం ధ్వంసం చేయడం జరిగింది.

Related posts