Praja Kshetram
తెలంగాణ

ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగానికి ప్రతిరూపమే తెలంగాణా!

ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగానికి ప్రతిరూపమే తెలంగాణా!

– చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ ఉద్ఘాటన!
– శంకర్ పల్లీ, చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేసిన భీమ్ భరత్

చేవెళ్ల / శంకర్ పల్లి జూన్ 2 (ప్రజాక్షేత్రం) : వందలాదిమంది ఆత్మ గౌరవ ప్రాణ త్యాగ పోరాట ఫలితమే నేటి తెలంగాణా అని చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి పామేన భీం భరత్ తెలిపారు.నాటి నిజాం కు, రజాకార్లకు, దొరల గడీలకు వ్యతిరేకంగా మొదలైన ఆత్మ గౌరవ స్వాతంత్ర పోరాటం సాధించుకున్న తెలంగాణ అనంతరం ఉమ్మడి రాష్ట్ర పాలకుల స్వార్థ పాలనలో తిరిగి మొదలైన తొలి, మలి దశ ఉద్యమాల లో అమరవీరుల రక్తం తో ఎరుపెక్కిన తెలంగాణా సమాజం చేసిన ఉద్యమ పోరాటాలు, ఉమ్మడి రాష్ట్రం లో పాలకుల అణచి వేతకు గురైనా విద్యార్థుల, ఉద్యోగుల, సామాన్య ప్రజల పోరాట స్ఫూర్తి తో చేసిన ప్రాణ త్యాగాలను గుర్తించి గౌరవించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరిగినా లెక్కచేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని గౌరవించారు అని భీం భరత్ తెలిపారు. అటువంటి త్యాగధనుల పోరాటంతో అమరుల త్యాగాలను గౌరవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణా ను గత పదేళ్లు గా ఒకే కుటుంబం దోచుకొని అప్పుల పాలు చేసి అవినీతి సొమ్ము దోచుకున్నారని తెలిపారు. వారితో పాటు ప్రశాంతం గా ఉన్న తెలంగాణా సామరస్య సంస్కృతి ని కలుషితం చెయ్యడానికి మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ లాంటి పార్టీ లను ఓడించి తిరిగి వివేక వంతుల్లైన తెలంగాణా ప్రజలు, తమకు తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించి సోనియమ్మ కానుకగా ఇచ్చినారని వారు అన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ కష్టపడి కృషి చేసి తిరిగి తెలంగాణా సంస్కృతిని , అభివృద్ధి కి కృషి చేస్తూ అవినీతి రహిత, ప్రజాహిత తెలంగాణా ను పునర్నిర్మించ వలసిన బాధ్యత ను కొనసాగించాలని భీం భరత్ ప్రజలకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.శంకర్ పల్లి, చేవెళ్ళ లో జరిగిన తెలంగాణా రాష్ట్ర పదవ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగరేసిన భీం భరత్, అనంతరం ప్రజలతో ఆవిర్భావ వేడుక సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మండల అధ్యక్షులు చైర్మన్ లు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేసారు.

Related posts