మరకత శివలింగాన్ని దర్శించుకున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
శంకర్ పల్లి జూన్ 03 (ప్రజాక్షేత్రం):
శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో బిజెపి సీనియర్ నాయకుడు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంగళవారం వెల్లడి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించాలని స్వామివారిని ఎంపీ అభ్యర్థి కోరుకున్నారు. ఆలయ చైర్మన్ సదానందం గౌడ్ ఎంపీకి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి స్వామివారి శేష వస్త్రంతో సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బిజెపి ప్రభుత్వం రాబోతుందని, తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు 10 నుండి 12 డబల్ డిజిట్ సీట్లు వస్తాయని, మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారని వెల్లడించారు.