శంకర్ పల్లి లో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు
శంకర్ పల్లి జూన్ 04 (ప్రజాక్షేత్రం): ఆంధ్ర ప్రదేశ్ లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా మంగళవారం శంకర్ పల్లి మండల కేంద్రంలో చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమంత్ ఆధ్వర్యంలో జనసేనాని అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ గౌడ్, శ్రీధర్, ఉదయ్ పాల్గొన్నారు.