Praja Kshetram
తెలంగాణ

గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

 

 

శంకర్‌ పల్లి జూన్ 05 (ప్రజాక్షేత్రం): మండలంలోని అన్ని

గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని శంకర్‌ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ వివో, హెడ్ మాస్టర్, స్పెషల్ ఆఫీసర్ ఏఏపిసి, పిఎస్ కమిటీలతో బడిబాట కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. బడి బయట పిల్లల్ని, బాల కార్మికులను, అంగన్వాడి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఏఏపీసి పనులను పూర్తి చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మోకిల సీఐ వీరబాబు గౌడ్, శంకర్‌ పల్లి క్రైమ్ ఎస్సై సత్యనారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్, హాస్టల్ సూపర్వైజర్స్, ఏపిఎం పాల్గొన్నారు.

Related posts