ప్రముఖ జాతీయ చిత్రకారుడు రాజేశ్వర్ గంగపుత్రను అభినందించిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర
హైదరాబాద్ జూన్ 08 (ప్రజాక్షేత్రం): నగరంలోని కింగ్స్ కోహినూర్ క్రౌన్ కన్వెన్షన్ లో తోలిసారి నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో వరంగల్ కు చెందిన గంగపుత్రుడు ప్రముఖ జాతీయ చిత్రకారుడు నన్నుట రాజేశ్వర్ గంగపుత్ర హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర సందర్శించి చిత్రకారుడు నన్నుట రాజేశ్వర్ గంగపుత్రకు పుష్పగుచ్ఛము అందించి శాలువాతో సత్కరించారు అనంతరము తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచూ రాజేశ్వర్ గంగపుత్ర వేసిన చిత్రాలు తన చిన్న తనం నాటి గంగపుత్ర మహిళలు చేపల చెరువు వద్దకు తాగునీటి కోసము బిందెలతో వచ్చి ముచ్చట్లు పెడుతున్న చేపల అమ్మకాల కళాఖండాలు అతని చిత్ర నైపుణ్యానికి ప్రతీకలని కొనియడుతూ గంగపుత్రుల కుల వృత్తి చేపల వేట,చేపల అమ్మకాలను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమన్నారు నన్నుట రాజేశ్వర్ గంగపుత్ర లాంటి చిత్రకారులను రాష్ట్ర ప్రభుత్వము తగిన గుర్తింపు కల్పించి పర్యాటక శాఖ ద్వార చిత్ర కళాకారులకు ప్రోత్యాహము అందించాలని కోరారు.