బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
శంకర్ పల్లి జూన్ 10 (ప్రజాక్షేత్రం): ఉపాధ్యాయుడు,మరియు సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండకల్ తాండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ మరియు ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ తండాలో ఇంటింటి సర్వే నిర్వహించి పిల్లల వివరాలను సేకరించడం జరిగింది.అనంతరం తాండ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్నటువంటి నిర్మాణ పనులు చేసే వలస కార్మికుల పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించడం జరిగింది. ఎల్లుండి పాఠశాల పునఃప్రారంభం రోజున పిల్లలను బడికి తీసుకవచ్చి పాఠశాలలో అడ్మిషన్ చేయాలని పిల్లల పేరెంట్స్ కి తెలపడం జరిగింది. ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను అంగన్వాడీలో మరియు ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయలని,ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు,యేటా రెండు జతల ఏకరూప దుస్తులు,మధ్యాహ్నం రుచికరమైనటువంటి పౌష్టిక ఆహారం,రోజు విడిచి రోజు ఉడికించిన కోడి గుడ్డు,రాగి జావా అందించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్,నోట్ బుక్స్, మరియు అనేక రకాల స్టేషనరీ అందించడం జరుగుతుందని వారికి ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం జరిగింది.