Praja Kshetram
తెలంగాణ

మాయ మాటలతోగద్దెనెక్కిన రేవంత్ సర్కార్

మాయ మాటలతోగద్దెనెక్కిన రేవంత్ సర్కార్

 

ఘనపూర్ స్టేషన్ జూన్ 10 (ప్రజాక్షేత్రం):ఆదివారం రోజున ఘనపూర్ నియోజకవర్గ కేంద్రo లోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండ.రాజయ్య మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పార్లమెంట్,శాసన మండలి ఎన్నికల్లో జోష్ గా ఉలిక్కి పడే విధంగా ప్రతీ బిఆర్ ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయడం జరిగిందని అన్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,నియోజకవర్గo లో అనేక పరిణామాలు జరిగాయి,బీఆర్ ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గా కడియం.శ్రీహరిని గెలిపిస్తే,స్వార్థ ప్రయోజనాల కోసం, కూతురు కి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరారు,ఆరు నెలల గా అభివృద్ధి మరిచి,తెలంగాణ అస్తిత్వం రాజముద్ర,తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ లో ప్రముఖుల పేర్లు మార్చడం తుగ్లక్ పాలన ను తలపిస్తుంది అన్నారు,తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటే,ప్రజల కు ఇచ్చిన హామీలు మర్చి పోయి, పిచ్చోడి చేతిలో రాయి లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు.

కడియం శ్రీహరి కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే.వెంటనే రైతులకు 2 రుణమాఫీ,ఎకరాకు 15 వేలు ,రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్,కళ్యాణ లక్ష్మీ లో తులం బంగారంతో పాటు ఆరు గ్యారెంటీ లు ఎక్కడ కనిపించడం లేదని అన్నారు.

ఘనపూర్ ను మున్సిపాలిటీ గా మార్చాలని,ఘన్పూర్ నియోజకవర్గంలో సైనిక స్కూల్ మంజూరైన కూడా ల్యాoడ్ ను కేటాయించకుండా అడ్డు పడ్డారని అన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు సొంత భవనం లేదని, ఢర్మ సాగర్ రిజర్వాయర్ అడుగంటిపోయిందాన్నారు,అభివృద్ధి చేస్తానని ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన కడియం.శ్రీహరి అభివృద్ధిని తుంగలో తొక్కారని అన్నారు.రేవంత రెడ్డి ప్రభుత్వం మాదిగ కులాలకు అన్యాయం చేసిందని, మా నాయకుడు కెసిఆర్ నన్ను ఒక మాదిగ బిడ్డగా నాలుగు సార్లు అంబెడ్కర్ రాసిన రాజ్యాంగమును గౌరవించి చట్టసభల కు పంపిన ఘనత బీఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారిందనిఅన్నారు,కాంగ్రెస్, మరియు బిజెపి లకు ముల్లు కర్రలాగా ప్రతి పక్ష పాత్ర ప్రజల తరుపున పోరాడుతామని అన్నారు. కొత్తగా ఎంపికఅయిన కావ్య చేస్తారని అన్నారు.మరి వారు రైల్వేకోచ్,ఉక్కుకర్మగారం, గిరిజన యూనివర్సిటీ మెడికల్ కాలేజీ, ఘనపూర్ లో మినీ లెదర్ పార్క్ అభివృద్ధి చేయ లన్నారు. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షములో ప్రజల తరపున పోరాటాలు చేస్తామని,ప్రజల తీర్పును గౌరవ విస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts