ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాం,పుస్తకాలు పంపిణీ
-ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
-మండల విద్యాధికారి బీమ్ సింగ్.
కొండాపూర్ జూన్ 11(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు యూనిఫాంలో తో పాటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని మండల విద్యాధికారి బీమ్ సింగ్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు చదువుకోవడానికి మంచి వసతులు కల్పిస్తున్నందున విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చే యూనిఫామ్ తోపాటు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందని తల్లిదండ్రులు ఈ విషయం గమనించి ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లల్ని పంపాలని అన్నారు.ఈ పంపిణీ కార్యక్రమంలో ఏపీఎం సరిత, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హెలిజాబెత్, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.