Praja Kshetram
తెలంగాణ

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి.

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి.

 

*-వెంచర్లకు అక్రమంగా మట్టిని తరలించడం ఆపాలి.*

 

*-రెవెన్యూ,మైనింగ్ అధికారులు చొరవ చూపాలి.*

 

*-తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.*

 

*-సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.నర్సిములు డిమాండ్.*

 

కొండాపూర్ జూన్ 14 (ప్రజాక్షేత్రం):

సిపిఎం పార్టీ కొండాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మాందాపూర్ గ్రామంలో 98 సర్వే నెంబర్ లో అసైన్డ్ భూముల గుట్టల నుండి అక్రమంగా వెంచర్లకు మట్టిని తరలించొద్దని పర్యటన నిర్వహించడం జరిగింది. సమస్యలతో కూడిన వినతి పత్రం తహశిల్దార్ అనిత కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నరసింహులు మాట్లాడుతూ మైనింగ్ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రలో ఉండడం వలన మాందాపూర్ గ్రామంలో గల 98 సర్వేనెంబర్ లోని అసైన్డ్ భూముల గుట్టలను తోలసి అక్రమ వెంచర్లల్లో రోడ్లకు ఉపయోగిస్తున్నారని రెవెన్యూ,మైనింగ్ అధికారులు మొద్దు నిద్ర విడాలని అక్రమ వెంచర్లకు మట్టిని తరలిస్తున్న వెంచర్ల యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మండలంలో ముని దేవునిపల్లి సి.హెచ్ కోనాపూర్,మాందాపూర్ గుట్టల నుండి అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్నారని వీటిని వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఆపాలని అన్నారు. వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయని,ఆహార కొరత ఏర్పడే పరిస్థితిలు ఎదురౌతున్నాయని, అనుమతులు లేకున్నా వెంచర్లను నిర్వహిస్తూ ప్లాట్లను అమ్ముతూ లాభాలు గడిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

*మండల కార్యదర్శి రాజయ్య మాట్లాడుతూ*

 

మండల అధికారులు మొద్దు నిద్రలో ఉండడం వలన ఇలాంటి అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అనుమతులు లేని వెంచర్లను వెంటనే ప్రభుత్వం సీజ్ చేయాలని,అధికారులు చొరవ చూపితేనే అక్రమ వెంచర్లు ఏర్పడవు అని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మండల పర్యటనలు నిర్వహిస్తామని అధికారుల దృష్టికి తీసుకొస్తామని అధికారులు వెంటనే చదవ చూపని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, సంజీవయ్య, రవికుమార్, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts