Praja Kshetram
తెలంగాణ

జూలై 7న వరంగల్ లో జరిగే 30 సంవత్సరాల ఆవిర్భావ సభను , ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయండి…

జూలై 7న వరంగల్ లో జరిగే 30 సంవత్సరాల ఆవిర్భావ సభను , ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయండి…

 

-ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అద్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ

-ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్కప్ప మాదిగ

కొడంగల్ జూన్ 19 (ప్రజాక్షేత్రం): బుదవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ అంజి మాదిగ అధ్యక్షతన నిర్వహించిన
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ హాజరై మాట్లాడుతూ వచ్చే నెల జూలై 7న జరుగు ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామల్లో జండా ఆవిష్కరణ జరిగేలా మండల అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. సమాజ శ్రేయస్సుకోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 30సం” కల సహకారం అవుతున్న తరుణంలో మాదిగ మరియు ఉప కులాల ప్రజలకి సమావేశాన్ని చేరవేయండి. అదేవిధంగా జులై 7న వరంగల్ వేదికగా జరిగే మాదిగల ఆత్మ గౌరవ కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కవాతు విజయవంతం చేయాలని ముఖ్యంగా వరంగల్లో జరగబోయే మాదిగల ఆత్మగౌరవ కవాతు కు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతం నుంచి తరలి వెళ్లాలని ప్రతి ఒక్కరిని ఎంఆర్పిఎస్ నాయకత్వం సిద్ధం చేయాలని నాయకులకు మల్లికార్జున్ మాదిగ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్కప్ప మాదిగ, జిల్లా కార్యదర్శి ఆర్ అంజి మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ, కొడంగల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు డి అశోక్ మాదిగ, దౌల్తాబాద్ మండల ఇంఛార్జి నరేందర్ మాదిగ, ఉపాధ్యక్షులు సిద్దు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ నాయకులు వెంకట్ మాదిగ, ఎన్ బాలు మాదిగ, శ్రీనివాస్ మాదిగ, నరేష్ మాదిగ,బొమ్మరేస్పేట్ మండల ఎం ఎస్ ఎఫ్ నాయకులు నసీర్ మహేష్ మాదిగ, రాములు నగప్ప మాదిగ, తదితరులు పాల్గోన్నారు.

Related posts