Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..

కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..

 

 

వేలూరు జూన్ 20(ప్రజాక్షేత్రం): కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్ కవర్ లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు.

Related posts