Praja Kshetram
తెలంగాణ

దాతలు స్పూర్తి అభినందనీయం

దాతలు స్పూర్తి అభినందనీయం

 

 

శంకర్ పల్లి జూన్ 20(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధిలోని మొకిల తాండ ప్రాథమిక పాఠశాలలో గురువారం బాబు నాయక్ సొంత నిధులతో బోరు వేయించి మంచి మనసు చాటుకున్నారు. విద్యార్థులకు నీటి కొరత ఉంది అని గ్రహించి బోరు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న విద్యార్థులు వినయం,విధేయత కలిగి,చక్కటి క్రమశిక్షణతో,చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరడం జరిగింది.విద్యార్థులు అందరూ ప్రారంభం నుండే ఉపాధ్యాయులు చెప్పిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు చదువుకొని ప్రతి ఒక్కరు తరగతిలో మొదటి ర్యాంకులో నిలవడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో చాలామంది ధనవంతులు ఉంటారు, కానీ పేదవారికి సహాయం చేసే గొప్ప మనసు కలవారు కొందరే ఉంటారని అందులో ఒక్కరని,వారు విద్యార్థుల అవసరాలను గుర్తించి పాఠశాలకు వచ్చి విద్యార్థుల అభినందనీయమని ప్రభుత్వ బడుల బలోపేతానికై దాతలు ముందుకు రావాలని కోరడం జరిగింది.

Related posts