త్వరలో కాంగ్రెస్లోకి కాలే యాదయ్య.. తేల్చిచెప్పిన ఎమ్మెల్యే దానం
చేవెళ్ల జూన్ 21(ప్రజాక్షేత్రం): ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గెలవకపోవడమే కాక ఎన్నికల ఫలితాలలో మూడో స్థానానికి చేరింది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అదే దారిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తో చర్చలు జరిపినట్లు కాలే యాదయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ ప్రకటనలో తెలిపారు.