Praja Kshetram
పాలిటిక్స్

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.. ఎంపీ అరవింద్

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.. ఎంపీ అరవింద్

 

 

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 21(ప్రజాక్షేత్రం): ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఇవాళ‌ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… బ్రిడ్జి నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts