Praja Kshetram
తెలంగాణ

శంకర్‌ పల్లిలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

శంకర్‌ పల్లిలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

 

 

 

శంకర్‌ పల్లి జూన్ 23 (ప్రజాక్షేత్రం): ఒకే దేశం, ఒకే విధానం అనే నినాదంతో ఆనాడు జమ్మూకశ్మీర్ స్వేచ్ఛ కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని శంకర్‌పల్లి మండల, మునిసిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు బసగళ్ల రాములు గౌడ్, సురేష్ అన్నారు. ఆదివారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, సురేష్ హాజరై శ్యాంప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి విశ్వనాధ్ మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్, తొండ రవి, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేష్, శశికాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, బచ్చు రామ్మోహన్, అనిశెట్టి సురేష్, రాజ్ కుమార్, వీరేందర్, హర్షవర్ధన్ నాయక్, సతీష్ రెడ్డి ఉన్నారు.

Related posts