Praja Kshetram
తెలంగాణ

సీఎంను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్లు

సీఎంను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్లు

 

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 23 (ప్రజాక్షేత్రం) : రంగారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్లు తీగల అనితాహరినాథ్‌రెడ్డి, పట్నం సునీతామహేందర్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. బొకే అందజేశారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా చైర్‌పర్సన్లు సీఎంను కోరారు. రూ2లక్షల రైతు రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts