Praja Kshetram
తెలంగాణ

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

 

 

మందమర్రిటౌన్‌, జూన్‌ 23 (ప్రజాక్షేత్రం): క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్‌, కాంగ్రెస్‌ నాయకులు నల్లాల ఓదెలు తెలిపారు. ఆది వారం సింగరేణి పాఠశాల వద్ద ఒలింపిక్‌ రన్‌ను ప్రారంభించారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఒలింపిక్‌ జ్యోతితో రన్‌ నిర్వ హించారు. కోల్‌బెల్ట్‌ రోడ్డు మీదుగా మార్కెట్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా సభ్యులు కన పర్తి రమేష్‌, క్రీడాకారుడు రాంవెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ నాయకులు కాంపెల్లిసమ్మయ్య, కాంగ్రెస్‌ నాయకుడు గుడ్ల రమేష్‌, క్రీడాకారులు అరవింద్‌, రాజలింగు, సంతోష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts