వానాకాలం పంటల సాగుపై అవగాహన.
-అన్నదాతలకు సాగులో సమస్యలు తలెత్తకూడదు.
-జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
కొండాపూర్ జూన్ 25 (ప్రజాక్షేత్రం): అన్నదాతలకు సాగులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల కేంద్రం లోని రైతు వేదిక భవనం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆర్థిక చేయూత అందించే ఉద్దేశంతో రాష్ట్రస్థాయిలో విధివిధానాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ప్రధమంగా నేరుగా క్షేత్రస్థాయిలోని రైతుల అభిప్రాయాలను సేకరించి ఏ విధంగా రైతు భరోసా కార్యక్రమం కింద ఆర్థిక చేయూతనిస్తే ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరుతుందో వంటి అంశాలను క్షేత్రస్థాయిలోని రైతులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం పేరు పైన ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.వానాకాలం లో వివిధ పంటల సాగు విధానం చీడపీడల నివారణ ఎరువుల యాజమాన్యం వంటి అంశాలపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలచే వివిధ యూట్యూబ్ వీడియోలను ప్రదర్శించడంతో పాటుగా రైతులతో నేరుగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేయాలనీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కొండాపూర్ రైతు వేదిక నందు నిర్వహించినటువంటి రైతు నేస్తం అవగాహన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అంబికా సోని, వ్యవసాయ అధికారులు గణేష్, ప్రతిభ, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు పాల్గొన్నారు.