Praja Kshetram
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తాం.

అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తాం.

-సి డి పి ఓ రేణుక

 

కొండాపూర్ జూన్ 25 (ప్రజాక్షేత్రం): అంగన్వాడి కేంద్రాలలోనే విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు ఆటపాటలతో చిన్నారులకు మంచి భోధనలు,సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నామని సిడిపిఓ రేణుక అన్నారు. మంగళవారం కొండాపూర్ లో రివైజ్డ్ ప్రీస్కూల్, కరికులం ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రాజెక్టుపై అంగన్వాడీ టీచర్లకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాన్ని ప్రీస్కూల్ గా మారుస్తూ విద్యార్థులకు ఆటపాటలతోపాటు, శారీరక, మానసిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఒక్కో ప్రాజెక్టులో మూడు రోజులపాటు సెషన్స్ ప్లాన్ ప్రకారం 10మంది మాస్టారు ట్రైన్లు ట్రైనింగ్ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు టీచర్లు ఉన్నారు.

Related posts