Praja Kshetram
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వెల్దండ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వెల్దండ ఎస్‌ఐ

 

 

నాగర్‌ కర్నూల్‌ జూన్ 26(ప్రజాక్షేత్రం) : వెల్లండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రవికుమార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకబట్టారు. ఇటీవల కల్వకుర్తికి చెందిన వెంకటేష్ ఇంట్లో జిలెటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని వెల్దండ ఎస్సై రవికుమార్‌ డిమాండ్‌ చేశాడు. దాంతో వెంకటేశ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు వెంకటేశ్‌ ఎస్సైకి ఫోన్‌ చేసి లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే ఎస్సై నేరుగా మాట్లాడకుండా అతని డ్రైవర్‌తో ఫోన్‌ చేయించి కాన్ఫరెన్స్‌లో వెంకటేశ్‌తో మాట్లాడాడు. ఎస్సై సూచన మేరకు వెంకటేశ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రూ.50 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related posts