బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి
హైదరాబాద్ జూన్ 27 (ప్రజాక్షేత్రం): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మొన్న కాళేశ్వరంలో సీఐ, నిన్న నల్లగొండలో ఎస్ఐ లైంగిక దాడి ఘటనలు మరవక ముందే తాజాగా రాజేంద్రనగర్‌లో ఓ కానిస్టేబుల్ బాలికను ట్రాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఆర్.జి.ఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రదీప్ అనే కానిస్టేబుల్ బుద్వేల్‌లో తన ఇంటికి ఎదురుగా నివసిస్తున్న మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడు. లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. దీంతో సదరు బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలపై సదరు కానిస్టేబుల్ సస్పెండ్ అయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
