శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి స్పీకర్ కు ఆహ్వానం
శంకర్ పల్లి జూన్ 27(ప్రజాక్షేత్రం):అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను గురువారం నగరంలోని ఆయన కార్యాలయంలో చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ కు ఆలయ ఆల్ ఇండియా చైర్మన్ దయాకర్ రాజు స్వామివారి చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని బహుకరించి, ఆలయానికి రావాలని ఆహ్వానించారు. మరకత శివాలయానికి తప్పకుండా హాజరవుతానని స్పీకర్ తెలిపారని ఆలయ కమిటీ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జైళ్ళ శాఖ డిజిపి గోపీనాథ్ రెడ్డి, ఆలయ పురోహితులు సాయి శివ ఉన్నారు.