Praja Kshetram
తెలంగాణ

బూర్గుల సౌత్ క్లాస్ కంపెనీలో జరిగిన ప్రమాదం పై సమగ్ర విచారణ చేయాలి.

బూర్గుల సౌత్ క్లాస్ కంపెనీలో జరిగిన ప్రమాదం పై సమగ్ర విచారణ చేయాలి.

 

-మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి

-కంపెనీ యజమాని శైలేష్ కుమార్ గుప్తాను వెంటనే అరెస్టు చేయాలి.

-సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్.

షాద్ నగర్ జూన్ 29(ప్రజాక్షేత్రం): ఫరూఖ్ నగర్ మండలం లోని బూర్గుల గ్రామ పంచాయితీ శివారు లోని సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెసర్ పేలిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోవడం 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డా సంఘటన ఆందోళన కలిగించే అంశం అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు.
ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సంఘటన జరిగిన ప్రదేశాన్ని వారు సందర్శించారు .అనంతరం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ .రాజు ,చంద్రమోహన్ లు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలి. యాజమాన్య పై కఠిన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారిలో గాయపడిన వారిలో ఇతర రాష్ట్రాలవలస కార్మికులే ఉన్నారు. మృతి చెందిన కార్మికులు గాయపడిన కార్మికులందరూ యువకులే. మృతులకు 50 లక్షల చొప్పున, అంగవైకల్యం పొందిన కార్మికులకు 25 లక్షలు, గాయపడిన వారికి పది లక్షల చొప్పున యాజమాన్యంతో ప్రభుత్వ వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని, సిఐటియు రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి. తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.ఫ్యాక్టరీ ఇనిస్పెక్టర్లు సరైన తనిఖీలు చేయడం లేదు. యాజమాన్యాలతో ప్రలోభాలకు లొంగి చూసి చూడనట్లు ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అందరూ అంతర్రాష్ట్ర వలస కార్మికులే కాబట్టి 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలి.కార్మిక శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని లేనిచో సిఐటియు దశల వారి ఉద్యమ కార్యచరణాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బిసా సాయిబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ సిఐటియు జిల్లా కోశాధికారి కవిత నాట్కో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మల్లేష్ కార్యదర్శి కిరియా నాయక్, శ్రీకాంత్,అశోక్, ఈశ్వర్ నాయక్,చంద్రమౌళి, కావలి రాజు, బేరి శ్రీనివాస్, మైలారం జంగయ్య, పాండు, రాజు నాయక్, రాయి కంటి, గోపాల్, మల్ రెడ్డి బాలరాజ్ ,లక్ష్మి ,సరిత ,రాజు,సయ్యద్ బాబు, యాదయ్య, రాజు,తదితరులు పాల్గొన్నారు.

Related posts