Praja Kshetram
జాతీయం

భారీ వరదలకు.. గంగా నదిలో కొట్టుకుపోయిన కార్లు, వీడియో వైరల్‌

భారీ వరదలకు.. గంగా నదిలో కొట్టుకుపోయిన కార్లు, వీడియో వైరల్‌

 

 

డెహ్రాడూన్‌ జూన్ 29(ప్రజాక్షేత్రం): ఉత్తరాదిలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో గంగా నదీ ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎడతెగని వర్షాలకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, హరిద్వార్, హల్ద్వానీ, కోట్‌ద్వార్‌తో సహా పలు నగరాల్లో భారీగా వరదలు సంభవించాయి. కాగా, హరిద్వార్‌లో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా వీధులు జలమయమయ్యాయి. అలాగే భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటి ఉధృతకు పార్క్ చేసిన కార్లు గంగా నదిలో కొట్టుకుపోయాయి. ఇది చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Related posts