ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి – నిర్ధుల మహేందర్ రెడ్డి.
-ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
-ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
మొయినాబాద్ జూన్ 30(ప్రజాక్షేత్రం) గ్రామ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యపరమైన సమస్యలను దూరం చేసుకోవాలని మాజీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిధుల మహేందర్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామంలో ఆదివారం నానాల్ నగర్ లో ప్రీమియర్ దావకాన బృందం ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ శేఖర్ యాదవ్, గౌతమ్ రెడ్డి, నరసింహారెడ్డి, నిర్ధుల శ్రీకాంత్ రెడ్డి, అవుసుల విజయలక్ష్మి, పెద్దలు ఈగ నరసింహారెడ్డి, మేకల లక్ష్మయ్య, నిర్ధుల నరసింహారెడ్డి, యాలాల రంగారెడ్డి, కిష్టయ్య, వడ్ల నరసింహ, కుమ్మరి నరసింహులు, వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
