అన్ని క్రీడా ప్రాంగణాలు ఆటలకు సిద్ధంగా ఉండాలి.
-ఎంపీడీవో జ్యోతిలక్ష్మి.
కొండాపూర్ జూలై 02(ప్రజాక్షేత్రం): మండల పరిధిలోని మునిదేవుని పల్లి గ్రామ వెంచర్ లో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి మండల పంచాయతీ కార్యదర్శులకు క్రీడా ప్రాంగణంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో భాగంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అన్నీ కూడా పూర్తిస్థాయి వాడకంలో రావాల్సిందిగా ఆదేశించారు. అన్ని గ్రామాల్లో కూడా ముని దేవుని పల్లి, మన్సన్ పల్లి గ్రామంలో ఉన్న విధంగా తెలంగాణ క్రీడా ప్రాంగణం తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే జిల్లా అధికారులు తీసుకున్న గూగుల్ మీట్ లో తెలిపిన విషయాలు పి డి ఐ గురించి పంచాయతీ కార్యదర్శులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్,ఏపీఓ వీరప్ప, ఈజీఎస్ స్టాప్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.