Praja Kshetram
తెలంగాణ

భూ దందాల కోసమే కాంగ్రెస్‌లో చేరిన యాదయ్య

భూ దందాల కోసమే కాంగ్రెస్‌లో చేరిన యాదయ్య

 

-చేవెళ్ల ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి.

-మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం డిమాండ్‌.

చేవెళ్ల, జూలై 02(ప్రజాక్షేత్రం): పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకునేందుకు, భూ దందాల కోసమే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రె్‌సలో చేరారని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే యాదయ్య బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కొన్నాళ్లకే అధికార కాంగ్రె్‌సలో చేరడం సిగ్గుచేటన్నారు. మొన్నటి వరకు సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కిన యాదయ్య చరిత్ర ఏంటీ.. ఆయన బతుకు ఏంటీ.. తిరుపతి లడ్డూలు అమ్ముకున్న విషయం ప్రజలందకీ తెలుసు అని మండిపడ్డారు. అధికారం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రె్‌సలో గెలిచి బీఆర్‌ఎ్‌సలోకి.. ఇప్పుడు బీఆర్‌ఎ్‌సలో గెలిచి అధికార దాహంతో కాంగ్రె్‌సలో చేరాడని, ఆయనకు నిజంగా సిగ్గు, శరం లేదన్నారు. యాదయ్య రాజకీయం చేసేకంటే బ్రోకర్‌గిరి చేస్తే బాగుంటుందని సలహా చేశారు. రంగారెడ్డి జిల్లాలో యాదయ్య దళితుల పరువు తీస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దొంగలను పార్టీలో చేర్చుకుంటే.. మీరు కూడా దొంగలవుతారన్నారు. రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలతోనే చేవెళ్లలో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. సీఎం కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రె్‌సకు పడుతుందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన యాదయ్య చేవెళ్ల ప్రజలకు క్షమాపణ చేయాలని డిమాండ్‌ చేశారు. బీజెపీ జిల్లా కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు కృష్ణగౌడ్‌, ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, రవీందర్‌, కృష్ణమోహన్‌, తదితరులు ఉన్నారు.

Related posts