Praja Kshetram
తెలంగాణ

పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పాలిటి వరం బొల్లారం వెంకట్ రెడ్డి

పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పాలిటి వరం బొల్లారం వెంకట్ రెడ్డి

 

-మా తల్లిదండ్రులు మరిచినా తాను మరువలేదు‌

-బూట్ల పంపిణీ పై కృతజ్ఞతలు తెలియజేసిన పొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

శంకర్ పల్లి జులై 04(ప్రజాక్షేత్రం): పొద్దుటూరు గ్రామ మాజీ ఎంపీటీసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి పొద్దుటూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ చేయడం పట్ల ఆ పాఠశాల విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మమ్మల్ని మరచిపోకుండా తానే జ్ఞాపకం ఉంచుకొని, బాగా చదివి ఉత్తీర్ణత సాధించిన వారికి, నగదు బహుమతులు, పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఒకటవ తరగతి విద్యార్థులకు పలకలు, ప్లేట్లు మరియు పాఠశాల విద్యార్థులందరికీ బూట్ల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్న మా అన్న బొల్లారం వెంకట్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, పాఠశాల విద్యార్థులు ఓ ప్రకటనలో తెలియజేశారు. మా కొరకు మీరు పడిన ప్రయాసాన్ని వృధా కానీయమని చక్కగా చదువుకొని మన గ్రామానికి మంచి పేరు తీసుకుని వస్తామని తెలియజేశారు. కాగా బుధవారం నాడు శంకర్ పల్లి ఎంఈఓ అక్బరుద్దీన్ చేతుల మీదుగా బూట్ల పంపిణీ కార్యక్రమం చేసిన విషయం అందరికీ తెలిసిందే, ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక రెడ్డి, శంకర్ పల్లి మండల ఎంఈఓ అక్బరుద్దీన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ఏనుగు లక్ష్మి, హై స్కూల్ ఉపాధ్యాయులు అశోక్, జంగయ్య, కర్ణ సాగర్ , రాములు, లలిత, సరస్వతి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు హరీఫ్, కృష్ణ, నరేందర్ రెడ్డి, బిల్ కలెక్టర్ మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts