Praja Kshetram
తెలంగాణ

శంకర్‌ పల్లిలో వృద్ధుడి అనుమానాస్పద మృతి

శంకర్‌ పల్లిలో వృద్ధుడి అనుమానాస్పద మృతి

 

 

శంకర్‌ పల్లి జులై 04(ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మున్సిపల్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం భీమయ్య (65) మినీ స్టేడియం వద్ద గల రెండు గదులలో ఒక గదిలో ఉండేవాడు. ప్రతిరోజు డబుల్ బెడ్ రూమ్ దగ్గర్లో చాయి బండి దగ్గరికి వచ్చి టీ తాగేవాడని, ఈరోజు టీ తాగడానికి భీమయ్య రాలేదని అక్కడే ఉండే సెక్యూరిటీ గార్డ్ సుగార్ సింగ్ తెలిపాడు. అనుమానంతో సెక్యూరిటీ గార్డ్ గది దగ్గరకు వెళ్లగా గది తలుపులు తెరిచి ఉన్నాయని, భీమయ్య గొంతుకు బలమైన గాయమైందని, అతడి కుడి చేతిలో కత్తి ఉందని, మంచంపై రక్తస్రావంతో పడి మృతి చెందాడని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts