దొడ్డి కొమరయ్య సేవలు మరువలేనివి —ఆలూరి మహేష్ యాదవ్
మొయినాబాద్ జులై 04(ప్రజాక్షేత్రం): తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు రంగారెడ్డి జిల్లా బిసి సంఘం అధ్యక్షులు ఆలూరి మహేష్ యాదవ్. ప్రతి ఒక్క యువకుడు దొడ్డి కొమరయ్యని ఆదర్శంగా తీసుకోని అన్యాయం ఎక్కడ జరిగిన పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అతి పిన్నా వయసులోనే ప్రాణాలను సైతం లెక్కించకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అన్యాయానికి ఎదురు నిలిచి నిజాం ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి అమరుడు అయ్యారని అటువంటి ధైర్యాశాలి, బలవంతుడు బాటలో నేటి యువకులు నడవాలని కోరుకున్నారు.
*బీర్ల ఐలయ్య కు మంత్రి పదవి ఇవ్వాలి*
ఆలేరు నియోజకవర్గం శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని మహేష్ యాదవ్ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. దొడ్డి కొమరయ్య వారసుడిగా కురుమ సంఘం నుండి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి బిసి లకు రాష్ట్రంలో తగిన న్యాయం చేయాలని కోరారు.