శంకర్ పల్లి మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
-కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ- రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు.
-జెండావిష్కరణ చేసి,కేక్ కటింగ్ చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
శంకర్ పల్లి జూలై 07(ప్రజాక్షేత్రం): ఆదివారం మండల కేంద్రంలో బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం పూల మాల వేసి మిఠాయి పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ హాజరైన మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో దక్షిణ భారత దేశంలో,ముఖ్యంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంటరానితనం అసమానతలు రూపుమాపుటకై ఆత్మగౌరవం హక్కులకై నినదీస్తూ ఏర్పడిన ఉద్యమం దండోరా ఉద్యమం. ఆత్మగౌరం హక్కులకై పోరాడుతూనే 59 ఉపకులాల ప్రజల హక్కులకై ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేపట్టి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం .ఇది మాదిగల చరిత్రాత్మక ఉద్యమం. మాదిగల చిరకాల ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సభండా కులాల కోసం అలుపెరగని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నా సంఘం మాదిగ దండోరా సంఘం.ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం ఒకే రోజు కావడం ఎంతో సంతోషకరవిషయం అన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు రంగారెడ్డి జిల్లా ఎం ఎస్ ఎఫ్ అధ్యక్షులు నాని భాను ప్రసాద్ మాదిగ, భారత్ మాదిగ, ప్రశాంత్ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, హరీష్,రాజు తదితరులు పాల్గొన్నారు.