కమ్మదనం ఫామ్ హౌస్ లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్య.
-భార్య ముందే గొంతుపై కత్తి పెట్టి చంపిన దుండగులు.
-బాబా అనే వ్యక్తి హత్యలు ప్రధాన సూత్రధారి.
-శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు మార్గమధ్యంలో మృతి.
-భూ లావాదేవీలే కారణమని అనుమానం.
షాద్ నగర్ జులై 10(ప్రజాక్షేత్రం): పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో ప్రముఖ రియల్టర్ కమ్మరి కృష్ణ అలియాస్ కేకే దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ఫామ్ హౌస్ లో ఉన్న కేకే వద్దకు బాబా అనే వ్యక్తి వచ్చాడు. టీ పెట్టమని చెప్పగా టీ తాగిన ఆనంతరం బాబా గట్టిగా అరుచుకుంటూ కేకే రెండు చేతులు పట్టుకోగా అక్కడే హోండా సిటీ కారులో వచ్చిన మరో ఇద్దరు దుండగులు కమ్మరి కృష్ణ గొంతును కత్తితో కోశారని మృతుడి భార్య మీడియా ముందు పేర్కొంది. గాయపడిన కృష్ణను శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతను మార్గమధ్యలో చనిపోయాడని చెబుతున్నారు.