రేపు కాంగ్రెస్‌లోకి మరో బీఆరెస్ ఎమ్మెల్యే
-రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేరికకు ముహూర్తం.
హైదరాబాద్ జులై 11(ప్రజాక్షేత్రం): అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆరెస్ నుంచి సాగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసల పరంపరలో మరో బీఆరెస్ ఎమ్మెల్యే శుక్రవారం బీఆరెస్‌కు గుడ్‌బై కొట్టబోతున్నారు. రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (శుక్రవారం) సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం నివాసంలో ప్రకాశ్‌గౌడ్‌తో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఇప్పటికే బీఆరెస్ నుంచి 7గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోగా, తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేడు కాంగ్రెస్‌లో చేరబోతున్న ప్రకాశ్‌గౌడ్ కాకుండా మరో 11మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతుండటం ఆసక్తికరం.