మానాల మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన భీంగల్ మండల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.
భీంగల్ జులై 11(ప్రజాక్షేత్రం): సహకార సంఘాల సంస్థ చైర్మన్ గా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా భీంగల్ మండలం నుండి హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భీంగల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు.బాధ్యతలు స్వీకరించిన మానాల మోహన్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పారు. శుభాకాంక్షలు తెలిపారు. మానాల కార్యక్రమంలో భీంగల్ మండల నాయకులు బొదిరే స్వామి,జేజే నర్సయ్య, గోపాల్ నాయక్,నాగేంద్ర, అనంత్ రావు, సాయిబాబా,నల్లూరి శ్రీనివాస్,సతీష్,బాలు, భూషణ్,అరిగేల జనార్దన్, రావూట్ల నవీన్,శేవ్వ గంగాధర్,రాజన్న,తోట ప్రదీప్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.