Praja Kshetram
తెలంగాణ

గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

 

 

కాగజ్‌నగర్‌ జూలై 12(ప్రజాక్షేత్రం): గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు మార్‌ అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్‌ పట్టణంలో పలువార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమార్కుల కబందహస్తాల్లో ఉన్న సిర్పూరు ప్రాంతాన్ని విముక్తి చేసేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌పార్టీలో చేరిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ తెలంగాణ ద్రోహిగా మిగిలినట్టు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీనాయకులు విద్యావతి రాజ్‌కుమార్‌, లెండుగురే శ్యాంరావు, నక్క శంకర్‌, ఆవుల రాజ్‌ కుమార్‌, కౌన్సిలర్‌మినాజ్‌, ముస్తాఫీజ్‌, నక్క మనోహర్‌, పోచం రేణికుంట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts