చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.
శంకర్ పల్లి జులై 12(ప్రజాక్షేత్రం): ప్రతి ఒక్కరు చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం శంకర్ పల్లి మండల పరిధి మాసానిగూడ గ్రామంలో 75వ వన మహెూత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవుని మనుగడ చెట్లతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. మొక్కలు నాటడంతో సకాలంలో వర్షాలు కురవడం ప్రతి జీవికి ఆక్సిజన్ అందించడంలో చెట్ల యొక్క పాత్ర ఎంతో ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, ఎంపీఓ, ఏపిఎం, పిఎస్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
