తాడ్ధన్పల్లి గ్రామంలో ప్రభుత్వం దళితులకు కేటాహించిన భూమి పై కన్నేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.
*-మా మాకు న్యాయం చేయండి.*
*-ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, ఎస్ పి లకు వినతి.*
సంగారెడ్డి జులై 15(ప్రజాక్షేత్రం):జిల్లాలోని చౌటకూరు మండల్ తడుదన్ పల్లి గ్రామం లో గత 40 సంవత్సరాలుగా రెండు కుటుంబాలు ఇదే భూమిలో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ మధ్య ఆర్మీ వాళ్లకు 2012 లో సర్వే నంబర్ 211 లో ఐదు ఎకరాల భూమిని అలర్ట్ చేసినట్టు చెబుతున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు భూమికి సంబంధించిన ఆర్మీ వాళ్ళు మా గ్రామానికి గాని, భూమి దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు. వాళ్లకు కేటాయించిన భూమి ఎక్కడుందో తెలియని వాళ్ళు మా భూమి పైకి వచ్చి అన్యాయంగా ఈ భూమి మాది అని దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో సభ నిర్వహించి గ్రామ పెద్ద మనుషులు ఎదుట మాట్లాడదామని ఎన్నిసార్లు వాళ్లకు విన్నవించుకున్న వినిపించుకోకుండా పోలీసు డిపార్టుమెంటులో పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని విషయమై ప్రజావాణిలో జిల్లా జయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ కి మా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుండి వస్తున్న బడా బాబులను చూస్తే మాకు ప్రాణహాని ఉందని తెలియజేయడం జరిగింది కాబట్టి మా సమస్యకు పరిష్కారం చూపి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య. గ్రామ పెద్దలు ఎండి మౌలానా.బాను చందర్.కృష్ణ కాంత్. ఎర్రోళ్ల రమేష్ పరిశోధన ఎర్రోళ్ల శిరీష తదితరులు పాల్గొన్నారు.
