Praja Kshetram
తెలంగాణ

రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి.

రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి.

 

*-రైతు రుణమాఫీ రైతుల ఆనందం.*

*- పామెన భీమ్ భరత్*

*చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.*

నవాబ్ పేట జులై 18(ప్రజాక్షేత్రం):నవాబ్ పేట మండలంలోని పార్టీ కార్యాలయంలో రైతు రుణమాఫీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయం తెలంగాణ రైతాంగానికి కొండంత భరోసా అని భీమ్ భరత్ అన్నారు. చాలా మంది చిన్న సన్నకారు రైతులకు లక్షల రూపాయలు రుణ మాఫి కావడం ఎంతో గర్వంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో రైతులు వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నవాబ్ పేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts