Praja Kshetram
తెలంగాణ

లోయలో పడిన కారు…ప్రయాణికులు సురక్షితం … సకాలంలో స్పందించిన పోలీసులు.

లోయలో పడిన కారు…ప్రయాణికులు సురక్షితం … సకాలంలో స్పందించిన పోలీసులు.

 

హైదరాబాద్ జులై 21(ప్రజాక్షేత్రం): హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న కారు నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఆదివారం తెల్లవారుజాము 2 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా, బాధితులు డయల్ 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తం అయిన నిర్మల్ సీఐ గోపినాథ్, సారంగపూర్ ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి లోయలో పడిన కారును గుర్తించారు. కారులో ఉన్న రాధాకృష్ణను, ఆయన భార్య, కుమారుడిని కాపాడారు. అదృష్టవశాత్తు ఆ ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్నజిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క వివరాలను తెలుసుకుని, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Related posts