ఎలాంటి నిర్మాణాలు జరగకుండా కలెక్టర్ చూడాలి : చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్.
మొయినాబాద్, జూలై 24(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండల పరిధిలో గల చిలుకూరు లొ జరుగుతున్న ఘర్షణల నేపధ్యంలో చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. చిలుకూరు బాలాజీ క్షేత్రం తిరుమల నుంచి స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి నిలిచిన ప్రాంతమని తిరుమలకు క్షేత్రానికి ఎలాంటి జీవో తీసుకొచ్చారో అలాంటి ఆంక్షలు కూడా బాలాజీ ఆలయానికి వర్తింపచేయాలని అలాగే రెండు కిలోమీటర్ల రేడియేషన్ మేర ఎలాంటి అన్యమతస్తుల మసీదులు, చర్చిలు నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు . వీటి వలన ఎన్నో కోట్ల మంది ప్రజలు మనోభావాలు దెబ్బతింటాయని , అలాగే ఇప్పుడు నిర్మించబోతున్న మసీదును వెంటనే నిలుపుదల చేయాలని ఆయన కలెక్టర్ ను మీడియా ముఖంగా కోరారు. అలాగే అలాంటివి ఏమన్నా చేపడితే ఇక్కడ మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని , కాబట్టి అలాంటివి జరగకుండా మా ముస్లిం సోదరులు కూడా సహకరించాలని ఆయన మీడియా ముఖంగా కోరారు..