Praja Kshetram
తెలంగాణ

ఆషాడ మాస బోనాల మహోత్సవాలలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బిస్సొల్ల శ్రీధర్.

ఆషాడ మాస బోనాల మహోత్సవాలలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బిస్సొల్ల శ్రీధర్.

-తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో బోనాల పండుగ ఓ భాగం.

శంకర్ పల్లి జూలై 28 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని పోచమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలలో శంకర్ పల్లి మాజీ సర్పంచ్ బిస్సొల్ల శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడ మాసంలో అమ్మవారి బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నామని అన్నారు. ఆడపడుచులు సామూహికంగా బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆడపడుచులు గణేష్ నగర్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts