Praja Kshetram
తెలంగాణ

నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే…

నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే…

 

 

-నేను ఏ పార్టీలోకి వెళ్లిన నన్ను చేర్చుకుంటారు.

 

-నేను సీఎం రేవంత్ ను కలవబోతున్నా..

 

-మా ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రమ్మన్నారు సీఎం కలిసి ధన్యవాదాలు చెప్తా.

 

హైదరాబాద్ ఆగస్టు 21(ప్రజాక్షేత్రం): నేను ఏ పార్టీలో చేరును.. అది ఎప్పుడూ ఉంది ప్రచారమే అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్ ఇవ్వడం అపుకోండిన్నారు. మనం అంతా ఏకం కావాలి అని వర్గాలకు అండగా సమానంగా పోరాడాలన్నారు. మాలల్లో అంబేద్కరిస్టస్ లేరు.. అంబేద్కర్ పేరు చెప్పుకుంటున్నారు అంతే అన్నారు. మాలల్లోనూ ఒకటే రెండు శాతం మంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారని తెలిపారు. మూలల్లో మనువాదులు పెరిగారు.. వాళ్ళు విప్లవాలు చేసేన వారు కాదన్నారు. మలల్లో ఎదిగిన మేధావులు.. రాజకీయ నేతలు అందరూ మనువాదులే… వాళ్ళు దేశ భక్తులు కాదని తెలిపారు. రోజు టీవీ చర్చల్లోకి వచ్చే మేము మేధావులం అని చెప్పుకుంటున్న వాళ్లు అంతా.. మనువాదులే.. మాదిగ వ్యతిరేకులే.. అన్నారు. ఆనాడు అగ్రకులాల్లనే మనువాదులు ఉండేవారు కానీ ఇప్పుడు మాలల్లోనే మనువాదులు పెరిగారన్నారు.

మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న మాలలకు నేను వ్యతిరేకంగానే పోరాడుతానని తెలిపారు. మాదిగలకు అండగా ఉండే వాళ్లు వెంట నేను ఉంటానన్నారు. నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండి ప్రచారమే అన్నారు. నేను పార్టీలో చేరుతున్నట్టు 1997 జూన్ లోనే ప్రచారం జరిగిందన్నారు. ప్రజలు తరపున పోరాటం చేయడానికే నేను ఉన్నానని నాడు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చాడు.. రాజ్యసభ ఇచ్చాడు వద్దన్నానని తెలిపారు. అప్పుడు టిడిపిలో చేరుతానని అనుకున్నారు.. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరుతాను అనుకున్నారు. ఏ పార్టీలోనూ చేరలేదని చేరలేదన్నారు. నల్ల కండువానే నా జీవితం.. దాన్ని నేను వదలనని తెలిపారు. ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్న నా పోరాటం ఆగదన్నారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశాను ఓడిపోయాను… కానీ ఏ పార్టీలో చేరలేదన్నారు. స్వసంత్రంగానే చట్టసభలోకి వెళ్లే అవకాశం ఉంటే వెళ్తాను.. నా స్వేచ్ఛను కోల్పనని తెలిపారు.

నేను ఏ పార్టీలోకి వెళ్లిన నన్ను చేర్చుకుంటారు.. పదవి ఇస్తారన్నారు‌‌. సాయంత్రం నేను సీఎం రేవంత్ ను కలవబోతున్నానని తెలిపారు. మా ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రమ్మన్నారు.. సీఎంకు ధన్యవాదాలు చెప్తానన్నారు. దేశంలో అందరికంటే ముందు మేము వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాల సోదరుల అధిపత్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన సరే ఓడిన సరే మాలలే సీట్లు ఇస్తుంది. ఇక్కడ మూడు సీట్లు కూడా మాదిగలకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదన్నారు. నాడు కొడంగల్..మల్కాజ్గిరిలో రేవంత్ కు నేను సపోర్ట్ చేశాను.. ఆయన కూడా ఇదే చెప్పారు.. రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక మాదిగలకు సీట్లు తగ్గాయన్నారు. రేవంత్ ను నమ్ముతాను కానీ మాల్లిఖార్జున ఖర్గేను నమ్మనని తెలిపారు. ఆయన చాలవాది మాదిగ వ్యతిరేకి ఆయన వ్యతిరేకిస్తాడు. వాళ్లు పార్టీ సీఎంలు స్వాగతిస్తున్నారు.

ఖర్గేను వదలను దేశవ్యాప్తంగా ఆయన గురించి తెల్చకకుంటానన్నారు. ఖార్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో సిద్ధిరామయ్య స్వాగతించాడు.. ఖర్గే వ్యతిరేకించాడన్నారు. వర్గీకరణ పై కాంగ్రెస్ స్టాండ్ ఏంటీ.! ఖర్గే స్టాండ్ ఏంటో చెప్పాలి.! వర్గీకరణ పై రాహుల్ గాంధీ మాట్లాడకుండా ఖర్గే నోరు మూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఖర్గే ..రాహుల్ ను బ్రతిమిలాడం.. వర్గీకరణకు అనుకూలమైతే ఖర్గే.. రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదు.. వర్గీకరణను వ్యతిరేకిస్తే ఎన్నికల హామీలు ఎందుకు ఇచ్చారని ఇచ్చారని ప్రశ్నించారు. 2004లో మేము నష్టపోవడానికి యూపీఏ ప్రభుత్వం కారణమన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించలేదు..2024లో మోడీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ సమర్పించిందన్నారు‌. సొలిసిటరీ జనరల్ ను పెట్టి వాదనలు వినిపించింది మోడీ సర్కార్.. వర్గీకరణకు మాకు సహకరించిన మోడీ అమీషా కిషన్ రెడ్డికి ధన్యవాదాలన్నారు.

Related posts